- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Caste Census: 65.02 శాతం పూర్తియిన ఇంటింటి కుటుంబ సర్వే.. ములుగు జిల్లా టాప్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన(Caste Census) ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఎంతమేరకు పూర్తి అయ్యింది అనే వివరాలు ప్రభుత్వం రోజు వారిగా వెల్లడిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సోమవారం వరకు 65.02 శాతం పూర్తయిందని తెలిపింది. దీని ప్రకారం ఎన్యూమరేటర్లు 75,75,647 నివాసాల్లో సర్వేను ముగించారు.
ఇందులో అత్యధికంగా ములుగు జిల్లా(Mulugu District)లో 95.3 శాతం సర్వే పూర్తయ్యి మొదటి స్థానం(First Position)లో ఉండగా.. నల్గొండ జిల్లా(Nalgonda District) 89.1 శాతం సర్వే పూర్తి చేసుకొని రెండవ స్థానం(Second Place)లో ఉంది. ఇక జనగామ(Janagama) జిల్లా 86 శాతం సర్వే పూర్తి చేసుకొని మూడో స్థానం(Third Position)లో నిలివగా.. గ్రేటర్(Greater) పరిధిలో 44.3 శాతం మాత్రమే సర్వే పూర్తయ్యి చివరి స్థానం(Last Position)లో ఉంది. కాగా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లలోని టీచర్లను సమగ్ర సర్వే విధులు నిర్వర్తించడానికి ఎన్యూమరేటర్లుగా నియమించింది. ఎన్యూమరేటర్లు ఉదయం పిల్లలకు పాఠాలు బోధించి మధ్యాహ్నం వేళ ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను ప్రారంభించగా.. తొలుత ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. తర్వాత ఈ నెల 9 నుంచి వివరాల నమోదును ప్రారంభించారు.