Ram Charan: దర్గాకు వెళ్లాలని ఆయన చెప్పారు.. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా వచ్చాను

by Gantepaka Srikanth |
Ram Charan: దర్గాకు వెళ్లాలని ఆయన చెప్పారు.. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా వచ్చాను
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కడప జిల్లాలో సందడి చేశారు. కడప దర్గా(Kadapa Dargah)లో నిర్వహించిన నేషనల్ ముషాయిరా గజల్ కార్యక్రమంతో పాటు ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం ఈ పెద్ద దర్గాకు వచ్చానని గుర్తుచేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో తన తండ్రి చిరంజీవి(Chiranjeevi) కూడా ఈ దర్గాకు వచ్చారని తెలిపారు. మూడు నెలల క్రితం అమీన్‌పూర్ దర్గాకు వెళ్లాలని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్(AR Rahman) సూచించారని.. అప్పుడే తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయ్యప్ప దీక్షలో ఉన్నా దర్గాకు వచ్చానని అన్నారు. ఇదిలా ఉండగా.. దర్గాకు వచ్చే ముందు చరణ్ కడపలోని శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా దర్గాకు వచ్చారు. గత ఏడాది ఇదే ఈవెంట్‌కు సంగీత దర్శకుడు ఎ.ఆర్‌ రెహమాన్‌ హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. అయ్యప్ప మాలలో దర్గాకు వచ్చిన చరణ్‌ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిజంగా నువ్వు ‘అన్‌ప్రిడిక్టబుల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed