Uttam: డ్యాం బాగుంటే ఎందుకు కుంగింది కేటీఆర్..? మంత్రి ఉత్తమ్

by Ramesh Goud |
Uttam: డ్యాం బాగుంటే ఎందుకు కుంగింది కేటీఆర్..? మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ మాటలకు నేను సమాధానం చెప్పానని, డ్యాం బాగుంటే.. ఎందుకు కుంగిపోయిందో ఆయన చెప్పాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం సహాయం తీసుకోలేదని, అందుకే మాకు సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అలాగే మూసి రివర్ ఫ్రంట్ కి కొంత గ్రాంట్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని అన్నారు.

ఇక 99 శాతం ఇండ్ల కి కొత్త నల్లాలు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. అది పూర్తిగా అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. కేటీఆర్ మాటలకి తాను సమాధానం చెప్పానని, ఇక్కడ పారె నీళ్లను చూసి కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డ్యామ్ బాగా ఉందంటే..ఎందుకు కుంగిపోయిందో చెప్పాలన్నారు. అలాగే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాంబు పెట్టారని ఎందుకు పిర్యాదు చేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు డ్యాం వద్దకు ఎన్ని సార్లు వెళ్లిన ఇబ్బంది లేదన్నారు. ఇక ఈ శాసనసభ సమావేశాల్లో కేబినెట్ సబ్ కమిటీ వేసి, కొత్త రేషన్ కార్డ్స్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డ్ అని, హెల్త్ కార్డ్ కోసం ఆరోగ్య శ్రీ అని తెలిపారు. ఇక రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story