- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
800 పోస్టులు అప్ గ్రేడ్ చేయండి! విద్యాశాఖ సెక్రటరీకి పండిత పరిషత్ నేతల వినతి
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 10వేల మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేశారని, పదోన్నతులు కల్పించగా మిగిలిపోయిన సుమారు 800 మంది భాషాపండిత, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి, వాటిలో అర్హులైన భాషాపండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ శుక్రవారం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతీపత్రం అందజేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా కోరారు. అలాగే విద్యాశాఖ సెక్రటరీకి ఆర్‌యూపీపీటీఎస్ సంఘం తరుపున ముద్రించిన ‘భాషాపండితుల విజయం’ అనే పుస్తకాన్ని అందజేశారు. బుర్రా వెంకటేశంను కలిసిన వారిలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి రమేశ్ ఉన్నారు.
Advertisement
Next Story