దూకుడు పెంచిన తుమ్మల.. కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-25 05:46:00.0  )
దూకుడు పెంచిన తుమ్మల.. కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం
X

దిశ, శేరిలింగంపల్లి : బీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఇప్పట్లో చల్లారేలా లేవు. రోజుకో నాయకుడు ఏదోలా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు టికెట్లు కేటాటూయించలేదంటూ పక్క పార్టీల్లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు బలప్రదర్శనకు దిగారు. చాలాకాలంగా బీఆర్ ఎస్ తో ఆంటీ ముట్టనట్టు ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి నిరాశే ఎదురయింది.

ఈసారి కూడా టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ నామా నాగేశ్వరరావును తుమ్మల ఇంటికి పంపి బుజ్జగించేందుకు యత్నించారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం తానుంటున్న గచ్చిబౌలి మై హోం బుజా నుండి ఖమ్మంకు భారీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్లారు. అక్కడ తన అభిమానులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తుమ్మల తెలిపారు.

Read More : అనుకోకుండా జరిగింది.. దయచేసి నన్ను క్షమించండి: Talasani Srinivas Yadav

Advertisement

Next Story