- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక తెలంగాణలకు రాకపోకలు బంద్.. రాయచూర్ కలెక్టర్ ఆదేశాలు
దిశ వెబ్ డెస్క్: నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన నిజాం కాలం నాటి కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ రహదారి-167 మరమ్మత్తులు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనవరి 17వ తేదీన ఉదయం 5 గంటల నుండి 45రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాదారులు ఆంక్షలను గమనించాలని కోరారు.
ఈ వంతెన మరమ్మత్తుల నేపధ్యంలో తెలంగాణ పోలీసులు ప్రత్యామ్నయ మార్గాలపై ఫోకస్ పెట్టారు.ఈ మేరకు కృష్ణ, మరికల్, మక్తల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా ఈ బ్రిడ్జికి పలు మార్లు మరమ్మత్తులు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ వంతెన స్ధానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడితే సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.