- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాహుల్‌ను ఇబ్బంది పెడుతున్న కేంద్రం.. ఎవర్నీ వదలం'
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్‌గాంధీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ. నిరంజన్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర లో భాగంగా శ్రీనగర్‌కు వెళ్లిన రాహుల్‌కు కొందరు మహిళలు, తాము బలాత్కారానికి గురవుతున్నామని వాపోయారని, ఇదే విషయాన్ని రాహుల్ జనవరి 30వ తేదిన కాశ్మీర్చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ, 50 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ మహిళల వివరాలు ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరడం విచిత్రంగా ఉన్నదంటూ నిరంజన్ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్మీయతతో గోడును వెల్లడించిన ఆ మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నిరంజన్అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అత్యాచారానికి గురైన బాధితుల వివరాలు బహిర్గత పర్చవద్దని చట్టమే చెబుతుండగా, కేంద్రం ఇలా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అని..? ప్రశ్నించారు. ఆ మహిళల సమ్మతి లేకుండా రాహుల్ గాంధి ఆ వివరాలు పోలీసులకు ఇచ్చే ఆస్కారం ఉండదని నొక్కి చెప్పారు. అయినా శ్రీనగర్‌లో రాహుల్ ప్రకటిస్తే ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహమెందుకు..? చూపుతున్నారో..? దేశ ప్రజలంతా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అదానీ పై రాహుల్పోరాడకుండా అడ్డుకునే చర్యగానే భావించాల్సి వస్తుందని నిరంజన్స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తున్నాయని, ఎవర్నీ వదిలేది లేదని ఆయన తేల్చి చెప్పారు.