BREAKING: ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్.. మొత్తం నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

by Satheesh |   ( Updated:2023-11-30 17:02:15.0  )
BREAKING: ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్.. మొత్తం నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69.09 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందే నాలుగు గంటలకే అధికారులు పోలింగ్ క్లోజ్ చేశారు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరిగింది. పోలింగ్ టైమ్ ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిల్చున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణ మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed