రేపు మాజీ సీఎం KCR డిశ్చార్జ్.. నేరుగా ఎక్కడికి వెళ్లనున్నారంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-14 07:46:48.0  )
రేపు మాజీ సీఎం KCR డిశ్చార్జ్.. నేరుగా ఎక్కడికి వెళ్లనున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రేపు(శుక్రవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఆస్పత్రి నుంచి నందినగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం మెరుగు పడటంతో ఇంటికి వెళ్లేందుకు ఆస్పత్రి వర్గాలు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంట్లో జారిపడటంతో తుంటి ఎముక విరగడంతో కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ ను ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి, సహా మంత్రులు, ఇతర పార్టీల ముఖ్య నేతలు, సినిమా హీరోలు ఆస్పత్రిలో పరామర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed