- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్‌కు KCR రీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్.. ఆ ఒక్క విషయంతో వచ్చేసిన క్లారిటీ..!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తారనే సమాచారంతో ర్యాంపు ఏర్పాటు చేశారు. తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ పూర్తిస్థాయిలో నడవలేక పోతున్నారు. దీంతో వీల్ చైర్‌కు అనువుగా ఉండేందుకు ఏర్పాటు చేసినట్లు భవన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ నెల 22న నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంతో సమావేశాలు ముగియనున్నాయి. అయితే వారం రోజుల్లో భవన్‌కు కేసీఆర్ వస్తారని సమాచారం. కొందరు మాత్రం ఈ నెల 20న భవన్‌కు వస్తారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఆయన భవన్‌కు వస్తేనే మళ్లీ కేడర్‌లో జోష్ వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఊత కర్ర సాయంతో నడక ప్రాక్టీస్
ఊత కర్ర సాయంతో ఎర్రవెల్లి ఫౌం హౌజ్‌లో గులాబీ బాస్ కేసీఆర్ నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో బుధవారం పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు పర్యవేక్షిస్తున్నారు. మరింత ధృధ సంకల్పంతో ప్రజల ముందుకు త్వరలోనే కేసీఆర్ వస్తారని పోస్ట్ చేశారు.