- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thummala Nageshwara Rao:భారీ వర్షాలకు పంటల్లో తెగుళ్ల బెడద..రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్:తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రైతులు పండిస్తున్న పంటల్లో చీడ పురుగులు(pests),తెగుళ్ల బెడద(Pest Infestation) పెరిగిపోయింది. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwara Rao) వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.సోమవారం ఆ శాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు(Sun Rot), పత్తిలో రసం పీల్చే పురుగులు(Sap-Sucking Insects), మెగ్నీషియం లోపం(Magnesium Deficiency) ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ఈ సమావేశంలో మంత్రికి వివరించారు.ఈ మేరకు అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రాబోయే 3,4 రోజులు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తెగుళ్ల బెడద పెరుగుతున్న నేపథ్యంలో పురుగుల నివారణ కోసం రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.