- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RC-16: ‘ఆ కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం’.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే స్పోర్ట్స్ డ్రామాగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్(shivaRaj Kumar), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్ర పోషించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రత్నవేలు(Rathnavelu) మాట్లాడుతూ.. “ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్ అయింది. కానీ, హాలీవుడ్ మళ్లీ నెగిటివ్ వినియోగించి సినిమా చిత్రీకరణలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నెగెటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం తేలికైన విషయం కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే.. నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు.
అదే నెగిటివ్ ఉండే కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. రామ్ చరణ్ ‘చిరుత’(Chirutha) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘మగధీర’(Magadheera) సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మనముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాడు.
భారీ బడ్జేట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వం వహించాడు. ఇక ఇతని పర్సనల్ విషయానికి వస్తే.. ఉపాసన(Upasana)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు ఈ జంటకు క్లీంకార(Klinkara) అనే పాప పుట్టింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రిన్సెస్ ఫేస్‌ని అయితే రివీల్ చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఆమె ఫేస్‌ను రివీల్ చేస్తారా అని ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.