- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఆర్ఎస్లో హరీష్ రావు vs కేటీఆర్.. ఇద్దరి వింత వైఖరితో విస్తుపోతున్న గులాబీ శ్రేణులు

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో కోల్డ్‌వార్ కొనసాగుతోంది. పార్టీలో తనదే పైచేయి అని అనించుకోడానికి కేటీఆర్, హరీశ్‌రావు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్ దగ్గర పట్టు సంపాదించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే వారు చాలా సందర్భాల్లో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ శ్రేణులు విస్తుపోతున్నారు.
ఇద్దరి మధ్య ఎందుకీ పోటీ?
తెలంగాణ బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ఫాంహౌష్‌కే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి పార్టీని కేటీఆర్, హరీశ్‌రావు ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ శ్రేణుల దగ్గర పట్టు నిలబెట్టుకోడానికి.. ఉనికిని చాటుకోడానికి ఇద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు.
ఒకేరోజు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
పదవీ కాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఇటీవల సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ హాజరవుతారని బీఆర్ఎస్ అధిష్ఠానం ముందుగానే ప్రకటించింది. తీరా చూస్తే ఆ కార్యక్రమానికి కేటీఆర్ ఒక్కరే హాజరయ్యారు. తాజాగా.. అంబేద్కర్ విగ్రహాలను వేర్వేరు చోట్ల ఇద్దరు ఒకే రోజు ఆవిష్కరించడం చర్చనీయాంశమైంది. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలం దాస్య నాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేటలోని రంగదాంపల్లిలో అదే విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఒకేరోజు ముఖ్యనేతలిద్దరూ.. వేర్వేరుగా అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించడంపై తెలంగాణలో వైరల్ అయ్యింది. బీఆర్‌ఎస్‌లో అనైక్యత రాగాలంటూ బీఆర్‌ఎస్ వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోల్ చేశాయి.