ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

by Mahesh |
ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికల్లో మాట్లాడుతూ.. మూడు పట్టణాల కలయిక అయిన హైదరాబాద్ కు తోడు నాలుగో నగరం అవసరం అని, మహేశ్వరం ప్రాంతంలో ఫోర్త్‌ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందిస్తూ.. కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మా సిటీ(Pharma City) రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని.. ఫోర్త్‌ సిటీ(Fourth City) పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ది చేసే కుట్ర జరుగుతుందని.. ఫార్మా సిటీ (Pharma City) ఉన్నట్టా..? లేనట్టా.? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందని న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఒకవేళ ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని కేటీఆర్‌(KTR) డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed