Dawood Ibrahim : ప్రొఫైల్ పిక్చర్‌గా దావూద్ ఫొటో..యువకుడికి ఏమైందంటే..

by Hajipasha |
Dawood Ibrahim : ప్రొఫైల్ పిక్చర్‌గా దావూద్ ఫొటో..యువకుడికి ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ఫొటోను సోషల్ మీడియా ప్రొఫైల్‌గా పెట్టుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా(Noida)లో ఉన్న సెక్టార్-9 ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జునైద్ అలియాస్ రేహాన్ అనే వ్యక్తి దావూద్ ఫొటోను తన ‘ఎక్స్’ అకౌంటులో ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈనెల 20న ఇదే విధంగా సోషల్ మీడియా(Social Media) అకౌంట్లలో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ఫొటోలను పోస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులను మహారాష్ట్రలోని పూణే పోలీసులు అరెస్టు చేశారు. వారిని నగరంలోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed