Funny &Viral : అడగాలే కానీ.. అది కూడా నేర్పిస్తా..!

by Javid Pasha |
Funny &Viral : అడగాలే కానీ.. అది కూడా నేర్పిస్తా..!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే.. ఏంట్రా బాబూ మరీనూ అని ఆశ్చర్యపోక తప్పదు కొన్ని కొన్ని సార్లు! అదంతే మరి.. మీమర్ల మాయాజాలమది! అట్రాక్టివ్ పోస్టులతోనూ, అదో రకమైన కామెంట్లతోనూ హాస్యం పండిస్తుంటారు. మంచి సందేశాలతోనూ, ముంచే సలహాలతోనూ దర్శనమిస్తుంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలిక..! సోషల్ వేదికలంటే ఎంత ఓపెన్ టాపో..!

తీపి, చేదు, ఘాటు, నాటు.. ఇలా అన్ని రకాల వాయిస్‌లకు, వార్తలకు, కామెంట్లకు అనువైన వేదిక ఇప్పుడు సోషల్ మీడియానే. కామెడీ మొదలు కొని ట్రాజడీ వరకు, ఫిక్షన్ మొదలు కొని సస్పెన్స్ వరకు, నవరసాలూ గిలిగింతలు పెడుతూ ఊరిస్తుంటాయ్ అక్కడ! అలాంటి ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతూ నవ్వులు పూయిస్తోంది. ఏంటంటే..‘@naku_bhutulu_urike_ravuu’ అనే పేరు గల ఇన్‌స్టా యూజర్ ద్వారా పోస్ట్ చేయబడిన ఆ పోస్టులో ఓ యువతి ఫొటో, దానికింద Sumanth అనే పేరు ఉంది. ఆ పేరు కింద కూడా ‘Replying to @ Ritika Nayak’ అనే మరో సెంటెన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ‘Nuvvu adgale kaani Anciant Telugu kuda nerpista’ అనే సెంటెన్స్ ఉంటుంది. ఇక దానికి రిప్లయ్‌గా అన్నట్లు కింది భాగంలో నడీడు వయసుగల ఓ వ్యక్తి ఫొటో, ఆ ఫొటో కింద ‘NUVVU EVARO CHALA KANTRILA UNNAV BETA’ అనే ‘Meme Sentence’ ఉంటుంది. ఇదే ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మీరూ లుక్కేసి హాయిగా నవ్వుకోండిక!



Next Story

Most Viewed