'రాజీవ్ యువ వికాస పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వండి'

by Sumithra |
రాజీవ్ యువ వికాస పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వండి
X

దిశ, ఏన్కూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న రాజీవ్ యువ వికాస పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ కోరుతూ టీయూడబ్ల్యూ జెఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఏన్కూర్ ఎంపీడీవో ఎస్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. కలం కార్మికుల్లాగా రోజువారి వేతనం లేకుండా ప్రజాసంక్షేమ ధ్యేయంగా, ప్రజల సమస్యలను వెలికితీస్తూ, తమ వృత్తిని ప్రాధాన్యతగా తీసుకుని రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులుగా గుర్తించాలని వినతి పత్రంలో కోరారు.

టీయూడబ్ల్యూ జెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజాముల్ ఖాన్ కలిసి విన్నవించారని, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని మండల అభివృద్ధి అధికారిగా తమ దరఖాస్తులను జిల్లా ఉన్నతాధికారులకు ప్రాధాన్యత కల్పించడం కొరకు సిఫార్సు చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జె.కృష్ణమాచారి, కంభంపాటి శ్రీనివాసరావు, ఎంఎస్.గోపాలరావు, బీగోపి వై.అశోక్ రెడ్డి, గుగులోతు బావు సింగ్, ఇస్లావత్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Next Story

Most Viewed