- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rahul Gandhi: తెలంగాణ సంపదపై రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని, ఈ విషయంలో తెలంగాణ దేశానికి ఓ మార్గం చూపిందని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. తెలంగాణలో (Telangana) 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని, కానీ రాష్ట్ర సంపద మాత్రం కార్పొరేట్ వర్గాల దగ్గరే ఉందని ఆరోపించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో (AICC meeting) ఆయన మాట్లాడారు. 24 గంటలు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడే నరేంద్ర మోడీ ఆ వర్గాలకు మాత్రం మేలు చేయరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను బీజేపీ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. కులగణనతోనే దేశంలో ఓబీసీలు, దళితులు, మైనార్టీల సంఖ్య తేలుతుందని, కానీ దీనికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన (caste censuscaste census) జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ఒక్కొక్కటిగా అదానీ, అంబానీకి విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. సిమెంట్, స్టీల్, ఎయిర్‌పోర్టులు, గనులు సహా కీలక పరిశ్రమలన్నీ అదానీకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు వేస్తుంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.