- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత్యక్రియల సమయంలో కదిలిన ఎనిమిది నెలల పసికందు.. హాస్పిటల్ తీసుకెళ్లగా..
దిశ, ఫీచర్స్ : బ్రెజిల్‌లోని కొరియా పింటోలో పుట్టిన ఎనిమిది నెలలకే వైరల్ ఇన్ఫెక్షన్ తో ఓ శిశువు మరణించింది. ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించడంతో కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. ఆ తర్వాత తనను ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సమయంలో ఆ చిన్నారి కొన్ని శారీరక కదలికలు గుర్తించిన పేరెంట్స్.. సంతోషంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళారు. కానీ ఆ ఆనందం కాసేపు కూడా ఉండకుండానే మరోసారి బిడ్డ చనిపోయినట్లు స్పష్టం చేశారు వైద్యులు. దీంతో ఇప్పటికే గుండె బద్దలయ్యేలా ఏడ్చిన తల్లిదండ్రులు.. రెండోసారి ఈ విషయాన్ని విని తట్టుకోలేకపోయారు.
కాగా పసికందు కియారా క్రిస్లేన్ డి మౌరా డోస్ శాంటోస్.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమె శ్వాస తీసుకోవడం లేదని.. చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆమెను రెండోసారి ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు మళ్లీ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. మరోవైపు ఆసుపత్రి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పింది. బ్రెజిల్ స్పెషలిస్ట్ సైంటిఫిక్ పోలీసులచే మెడికల్ సెంటర్‌పై విచారణ కూడా ప్రారంభించబడింది.