TVS Rider iGo: iGO టెక్నాలజీతో సరికొత్త టీవీఎస్‌ రైడర్‌ బైక్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!

by Maddikunta Saikiran |
TVS Rider iGo: iGO టెక్నాలజీతో సరికొత్త టీవీఎస్‌ రైడర్‌ బైక్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌(TVS Motor) దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సందర్భంగా మార్కెట్లోకి సరికొత్త బైక్(Brand New Bike)ను విడుదల చేసింది. కాగా టీవీఎస్ రైడర్‌ 125(TVS Rider 125)కి భారత్‌(India)లో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఇటీవలే 10 లక్షల అమ్మకాలతో ఈ బైక్ రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే రైడర్ 125లో కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది. TVS రైడర్ iGo(TVS Rider iGo) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. దీన్ని iGo అసిస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరను రూ. 98,389 (ఎక్స్‌-షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. నార్డో గ్రే(Nardo Grey) కలర్ ఆప్షన్​లో మాత్రమే ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే .. 124.8 సీసీ 3-వాల్వ్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ జనరేటర్ (ISG)తో వస్తుంది. ఈ ఇంజిన్ సాధారణంగా 11.22bhp పవర్, 11.3Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ మోడ్‌లో వెళ్తే మాత్రం 11.75Nm టార్క్ ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇతర వేరియంట్స్ కంటే రైడర్ iGo 10 శాతం ఎక్కువ ఫ్యూయెల్ ఎఅబిలిటీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన లుక్ కోసం ఈ బైక్​లో రెడ్ కలర్ అల్లాయ్ వీల్ అమర్చారు. ఈ మోటార్​సైకిల్ LCD డిజిటల్ డిస్ ప్లేను కలిగి ఉంది. అలాగే బ్రేకింగ్ కోసం ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక సైడ్ వీల్ కు డ్రమ్ బ్రేక్ అమర్చారు. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెన్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా ఇతర టీవీఎస్ రైడర్‌లో ఉన్నాయి

Advertisement

Next Story

Most Viewed