- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరువు తగ్గించే మసాలా దినుసులు
X
దిశ, ఫీచర్స్ : లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోవడం కామన్ అయిపోయింది. దీనివల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మన వంటింటి మసాలా దినుసులు కొవ్వు తగ్గించేందుకు, బరువు నియంత్రణకు ఎలా సహాయపడుతాయో చెప్తున్నారు నిపుణులు.
- రెడ్ మిర్చి... ఇందులో క్యాప్సైసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి అంతర్గత కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గించే విధానాన్ని మరింత పెంచుతుంది.
- ఏలకులు... ఇలాచిలో మెలటోనిన్ తోపాటు ఉన్న ఇతర లక్షణాలు.. జీవక్రియ, జీర్ణక్రియను పెంచుతాయి. బెల్లీ ఫ్యాట్ కరిగించేలా చేస్తాయి.
- నల్ల మిరియాలు.. ఇవి పైపెరిన్ కలిగి ఉంటాయి. ఇది జీవక్రియ, ఫ్యాట్ బర్న్ చేసే ప్రాసెస్ ప్రేరేపించడంలో హెల్ప్ అవుతుంది.
- దాల్చిన చెక్క.. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- అల్లం.. అత్యంత సాధారణ మసాలా దినుసులలో ఒకటి. ఇది జీవక్రియను పెంచే థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి, కొవ్వును కాల్చడానికి మరింత సహాయపడుతుంది.
- జీలకర్ర.. ఇది కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కేలరీలను బర్న్ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
Advertisement
Next Story