మీ బ్రెయిన్‌కు రెస్ట్ కావాలనే సంకేతాలు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-26 15:44:18.0  )
మీ బ్రెయిన్‌కు రెస్ట్ కావాలనే సంకేతాలు..
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లతో బ్రెయిన్ పని చేయడం మానేస్తుంది. కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుందో, ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలియకుండా అయిపోతుంది. అలాంటప్పుడే మెదడుకు విశ్రాంతి అవసరం అంటున్నారు నిపుణులు. ఎప్పుడు బ్రెయిన్ కు రెస్ట్ అవసరమో సూచిస్తున్నారు.

ఏకాగ్రత కష్టం

మీరు టాస్క్‌లపై ఫోకస్ చేయడం లేదా ట్రాక్ చేయడం కష్టంగా అనిపించినప్పుడు.. ఇక ఆపేయాలని, తనకు రెస్ట్ అవసరమని బ్రెయిన్ చెప్తుందని గుర్తించాలి.

చిరాకు

స్వల్ప కోపమా? చిన్న విషయాలు మీ బీపీ పెంచుతున్నాయా? మానసిక అలసట మరీ ఎక్కువకపోయిందని అనేందుకు ఇది సంకేతం

నిరంతరం అలసట

రాత్రి హాయిగా పడుకున్నాక కూడా లేవగానే అలసిపోతున్నట్లు అనిపిస్తే.. మీకు విశ్రాంతికి మించిన అవసరం ఉందన్నట్లే. బ్రెయిన్ కు కాస్త విశ్రాంతి కావాలని అన్నట్లే.

నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది

చిన్నచిన్న నిర్ణయాలు కూడా భారంగా అనిపించినప్పుడు.. మీ మెదడు అలసిపోయిందని, విరామం కోరుకుంటోందని తెలిపేందుకు ఇది స్పష్టమైన సంకేతం.

మతిమరుపు

సాధారణ విషయాలు గుర్తుకు ఉండట్లేదా? ఇది ఓవర్‌లోడ్ అయిందని, డౌన్‌టైమ్ అవసరమని మీ మెదడు సూచించే మార్గం కావచ్చు.

పెరిగిన ఒత్తిడి, ఆందోళన

మీ ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటే లేదా మీరు సాధారణం కంటే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లయితే.. పనులన్నీ వదిలేసి మీ మెదడును శాంతపరచడం మంచిది.

క్రియేటివిటీ లేకపోవడం

కూరుకుపోయినట్లు ఉంటున్నారా? తాజా ఆలోచనలతో ముందుకు రాలేకపోతున్నారా? మీ మెదడు మీరు వెనుకడుగు వేయాలని, విశ్రాంతి తీసుకోమని, రీఛార్జ్ చేయమని చెబుతూ ఉండవచ్చు.

Advertisement

Next Story

Most Viewed