పొలాల్లోకి వచ్చిన గిరినాగు.. ఒక్కసారిగా రైతుల మీదకి ఎగబడి.. ఏం చేసిందో చూడండి!(వీడియో వైరల్)

by Jakkula Mamatha |   ( Updated:2025-03-29 15:17:55.0  )
పొలాల్లోకి వచ్చిన గిరినాగు.. ఒక్కసారిగా రైతుల మీదకి ఎగబడి.. ఏం చేసిందో చూడండి!(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా పొలాల్లో పాములు కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటారు. ఆ పాము ఇంకా అక్కడే ఉందా? లేదా వెళ్లిపోయిందా అనే అనుమానంతో భయంతో గజగజ వణికిపోతుంటారు. చాలామంది పెద్ద పెద్ద పాములను డిస్కవరీ ఛానల్‌లో తప్ప బయట చూసుండరు. ఓ 15 అడుగుల భారీ గిరినాగు(కింగ్ కోబ్రా) పొలాల్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ భయం మాములుగా ఉండదు. ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతుంది. ఇక ఆ గిరినాగు వెంట పడితే మాత్రం.. గుండె అరచేతిలో పట్టుకుని పరుగు పెట్టాల్సిందే.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లాలో భారీ విషసర్పం కలకలం రేపింది. జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ గిరినాగు రైతులను వణికించింది. పొలాలకు వెళ్లిన రైతులు వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటునుంచి వచ్చిందో ఏమో కానీ పొలాల్లోకి వచ్చిన ఆ భారీ గిరినాగును కుక్కలు నిలువరించాయి. ఈ క్రమంలో గిరినాగు పక్కనే ఉన్న చెట్ల నుంచి తొంగి తొంగి చూస్తున్న రైతుల పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది.

దీంతో వారు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో ఆ పాము చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది. రైతులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చుట్టుపక్కల పాము మరల వస్తుందేమోనని భయంతో వణికిపోతున్నారు. ఇక ఈ విష సర్పంతో ఎప్పటికైనా ప్రమాదం అని పలువురు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Click For Tweet Post..


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story