- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamilanadu: తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థకు గురైన విద్యార్థులు
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని తిరువొత్తియూరులోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని కొంతమంది విద్యార్థులు ఆవరణలో కెమికల్ గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో కనీసం ముగ్గురు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఘటన గురించి తెలుసుకోవడానికి వెళ్లిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందం ఖచ్చితమైన కారణం తెలియరాలేదని చెప్పారు. పాఠశాల ల్యాబ్ నుంచి ఎలాంటి గ్యాస్ వెలువడలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. కొందరు కళ్లలో చికాకుగా భావించారు, మరికొందరు అకస్మాత్తుగా వికారంగా ఉందన్నారు.
'గాలి కోసం కొంతమంది క్లాసు నుంచి బయటకు పెరిగెత్తాం. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారని' విద్యార్థులు చెప్పారు. చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం అంబులెన్స్‌లను పిలిపించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించడంతో పలువురు ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. స్కూల్ నుంచి లీకేజీ అయిందా లేక కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి లీక్ వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, దాదాపు 30 మంది విద్యార్థులు అసౌకర్యం, గొంతునొప్పితో ఫిర్యాదు చేశారు. అనుమానిత రసాయన వాయువు లీకేజీకి గల కారణాలపై ఆరా తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాఠశాలను సందర్శించారు.