- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంతానానికి దివ్య ఔషధంగా దగ్గు మందు.. ట్రెండింగ్‌లో ఉంది మరి...
దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రులు కావాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారిలో ఇది మరీ ఎక్కువ. ఈ క్రమంలో సంతానాన్ని పొందేందుకు ఉన్న ఏ దారి వదిలిపెట్టరు. అయితే ఇందుకు తాజా పరిష్కారంగా 'మ్యూసినెక్స్ పద్ధతి' సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జలుబు, దగ్గుకు ఉపయోగించే Mucinex మెడిసిన్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పబడుతుంది. యాక్టివ్ సబ్ స్టాన్స్ guaifenesin కలిగి ఉన్న ఓవర్-ది-కౌంటర్ మెడిసిన్ ఉపయోగించడం వల్ల విజయవంతమైన గర్భధారణకు దారితీస్తుందని వైరల్ అవుతోంది.
ఇదెలా సాధ్యం?
అసురక్షిత లైంగిక సంపర్కం సమయంలో స్పెర్మ్ యోని పైభాగంలో పేరుకుపోతుంది. గుడ్డును చేరుకోవడానికి, ఫలదీకరణం చేయడానికి.. స్పెర్మ్ మొదట గర్భాశయాన్ని దాటాలి. ఇది యోని, గర్భాశయాన్ని కలిపే చిన్న కలువ లాంటిది. కాగా గర్భాశయం శ్లేష్మం ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే పీరియడ్స్ టైంలో గర్భాశయ శ్లేష్మం పరిమాణం, స్థిరత్వం మారుతుంది. అండోత్సర్గము సమయంలో సెట్ అవుతుంది. కాగా శ్లేష్మం ఎక్కువగా ఉంటే లేదా చాలా మందంగా ఉంటే.. అది గుడ్డులోకి స్పెర్మ్ చేరకుండా ఆపవచ్చు. అయితే మ్యూసినెక్స్ తీసుకోవడం ద్వారా స్త్రీ గర్భాశయ శ్లేష్మం సన్నబడుతుందని, స్పెర్మ్ గుడ్డును చేరుకోవడం సులభతరం చేస్తుందనే ఆలోచన ఉంది.
ఇక ఫెర్టిలిటీ ట్రాకింగ్ యాప్స్ యూజ్ చేసే మహిళలు ఎక్కువైపోవడంతో గర్భాశయ శ్లేష్మం పరిమాణం, స్థిరత్వం పర్యవేక్షించడం ఈజీ అయిపోయింది. గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న స్త్రీలు ఇలాంటివి ట్రై చేయడంలో అస్సలు వెనుకాడటం లేదు. మ్యూసినెక్స్ వంటి ఓవర్-ది-కౌంటర్ ప్రొడక్ట్ ఆహార నియంత్రణ లేదా ఇతర జీవనశైలి కారకాలలో మార్పు కంటే మరింత వేగవంతమైన ఫలితాలతో త్వరిత, సరళమైన పరిష్కారం వలె కనిపిస్తుంది. అయితే మ్యూసినెక్స్ సంతానోత్పత్తికి సహాయపడగలదని రుజువు చేసే శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి.