- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR చాంబర్‌లో ‘నో ఛేంజ్’.. అదే ఫైనలని తేల్చిచెప్పిన అసెంబ్లీ వర్గాలు
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చాంబర్ కేటాయింపు జరిగిందని, ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలంటే స్పీకర్ ఆదేశిస్తారని పేర్కొన్నాయి. అసెంబ్లీ ప్రారంభం రోజున కేసీఆర్‌కు ఇరుకైన చాంబర్ కేటాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ లీడర్‌ను అవమానపరచాలనే ఉద్దేశంతోనే చిన్న రూమ్ ఇచ్చారని విమర్శలు చేశారు. ఇదే అంశాన్ని బీఏసీ సమావేశంలో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తావించి, తమకు పెద్ద రూం కేటాయించాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిసింది. అయితే ప్రతిపక్ష లీడర్‌కు హోదాకు తగ్గట్టుగానే రూం కేటాయించామని, ఆ పార్టీ చేస్తోన్న విమర్శలను పట్టించోవాల్సిన అవసరం లేదని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.