Beerla Ilayya: స్కిల్ వర్సిటీ విషయంలో కేటీఆర్ అసలు ఉద్దేశం అదే: బీర్ల ఐలయ్య

by Prasad Jukanti |
Beerla Ilayya: స్కిల్ వర్సిటీ విషయంలో కేటీఆర్ అసలు ఉద్దేశం అదే: బీర్ల ఐలయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఐలయ్య.. కేటీఆర్ కు మైండ్ ఉందా లేక అందులో అశుద్ధం ఉందో అర్థం కావడం లేదన్నారు. సైకో రామ్ తన శాడిజాన్ని చూపిస్తున్నాడని, అతడి మెదడు అంతా రేవంత్ రెడ్డిపై అక్కసు, ద్వేషం, పగతో నిండిపోయిందని ఆరోపించారు. కేటీఆర్ మోహంలో వికృతానందం, అహంకారం కొట్టొచ్చినట్లు కనిస్తున్నాయి. కళ్లలో ద్వేషం, ఒంటి నిండా ఉక్రోషంతో ఊగిపోతు నోటికొచ్చిన సొల్లు వాగుడు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ అసలు ఉద్దేశం అదే..

స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్ల చెక్ ను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించిన తర్వాత కూడా కేటీఆర్ వాగుతూనే ఉన్నాడని, అదానీ నుంచి చెక్ రూపంలో, బహిరంగంగా మా ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కోసం సీఎస్ఎఆర్ ఫండ్స్ తీసుకుందన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని అదానీ ఇచ్చిన చెక్ ను ప్రభుత్వం వెనక్కి పంపించిందన్నారు. అయినా పాడిన పాటే మళ్ళీ పాడుతూ కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. స్కిల్ యూనివర్సిటీకి నిధులు రాకుండా చేయడమే కేటీఆర్ అసలు ఉద్దేశం అని ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అయితే రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతో అదానీని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఈ తరహా చిల్లర విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తే ఖబద్దార్ అని హెచ్చరించారు.

పదేళ్ల పాటు అదానీతో అంటకాగి, అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెపుతున్నారని అదానికి చెందిన ప్రత్యేక విమానాల్లో తిరిగిన రోజులు కేటీఆర్ మరిచిపోయినట్లున్నాడన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి బీజేపీతో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉందన్నారు. కేటీఆర్ కు మతి భ్రమించిందని ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లి చూయించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వీర విధేయుడు. రాహుల్ గాంధీ మాట మా రేవంత్ రెడ్డి కి శిలా శాసనం అన్నారు. రాహుల్ గీసిన గీతను రేవంత్ రెడ్డి దాటరన్నారు. అధిష్టానం మాటే మా ముఖ్యమంత్రి మాట.. మా అందరి బాట అని చెప్పారు. తెలంగాణ మహిళల కోసం అనేక సంక్షేమాలను అమలు చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కుల గణన చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ గా ఉందని చెప్పారు.The real intention of KTR in the matter of Skill Varsity is the same: Beerla Ilayya

Advertisement

Next Story

Most Viewed