- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Sitakka : రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
దిశ, ములుగు ప్రతినిధి: రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పాల్ సబ్ పల్లి రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1000 ఎంటి గోదాంను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, పి ఎస్ సి ఎస్ చైర్మన్ సత్తి రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
ములుగు ప్రాంతంలో చాలా మంది రైతులు ఎక్కువ ధాన్యాన్ని పండించడం జరుగుతుందని , పండించిన పంటను దృష్టిలో ఉంచుకొని ములుగు ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో గోదాం లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు, పిఎసిఎస్ కేంద్రాలు సమన్వయంతో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా చూడాలని అన్నారు. ములుగు ప్రాంతంలో ధాన్యం రావడానికి కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ములుగు ప్రాంతంలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏకకాలంలో ప్రారంభించడం జరుగుతుందని , త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అదేవిధంగా ఎక్కడైతే గోదాం నిర్మాణం అవసరం ఉంటుందో రైతులు జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలో ఉపాధి హామీ పథకం పనులలో భాగంగా రైతులకు ఉపయోగపడే పనులను చేసే దిశగా చూడాలని, చెక్ డ్యాం ల నిర్మాణం వంటి పనులు చేయాలని అన్నారు. వీటి కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1370 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఐటీడీఏ నుంచి రూ. 50 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, పంచాయతీ రాజ్ విభాగం నుంచి సీసీ రోడ్స్ నిర్మాణం వంటి పనులు గుర్తించడం జరిగిందని తెలిపారు.
ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపెట్టాలని , గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కల్పించడంతోపాటు, చేసే ప్రతి పని అందరికీ ఉపయోగకరంగా ఉండాలని, పనుల విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, డి సి ఓ సర్దార్ సింగ్, పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ రాజు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బాదం ప్రవీణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.