- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగ్గంపై బంగారు చీర..సిరిసిల్ల నేతన్న అద్భుతం
దిశ, వెబ్ డెస్క్ : హస్త కళలు..ముఖ్యంగా అద్భుత చేనేత కళల కాణాచిగా విరాజిల్లుతున్న తెలంగాణ చేనేత రంగం మగ్గంపై మరో అద్భుతాన్ని సృష్టించి మరోసారి ప్రపంచాన్ని అబ్బరపరిచింది. పోచంపల్లి..గద్వాల పట్టుచీరలతో జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్ధాయిలోను పలు అవార్డులను కైవసం చేసుకున్న మన నేతన్నలు అగ్గిపెట్టేలో పట్టే చీరను నేయడంతో పాటు మహానీయుల చిత్రాలను సైతం తమ వస్త్ర డిజైన్లలో ఆవిష్కరింపచేశారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, 200 గ్రాముల బంగారంతో బంగారు చీరను తయారు చేసి మరోసారి తెలంగాణ నేతన్నల కౌశలాన్ని అందరికి చాటాడు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురి వివాహ కోసం బంగారు చీర తయారు చేయాలని నల్లా విజయ్‌కుమార్‌ని సంప్రదించారు. చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్ వచ్చిందని విజయ్‌కుమార్ తెలిపారు. బంగారాన్ని జరిపోవులు తీయడానికి, కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి 12 రోజులు పట్టిందని ఆయన చెబుతున్నారు. ఈ బంగారు చీర పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 49 ఇంచులు, బరువు 800 నుంచి 900 గ్రాముల లోపల ఉంటుందన్నారు. వచ్చే నెల 17వ తేదీన వ్యాపారి కుమార్తె వివాహం కోసం ఈ చీర తయారు చేశామన్నారు. ఈ చీరలో 200 గ్రాములు బంగారాన్ని ఉపయోగించామన్నారు. ఈ చీర తయరీకి 18 లక్షల రూపాయల ఖర్చు జరిగినట్లు తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని నల్లా విజయ్‌కుమార్ తెలిపారు.