- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna: కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్.. రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు
దిశ, డైనమిక్ బ్యూరో: తన కుటుంబం వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారించింది. నాగార్జున తరపున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో రేపు ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. సమంత నాగచైతన్య విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ అంతా నాగార్జున కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ సర్వత్రా ఉత్కంఠగా మారింది.