- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్
దిశ, వెబ్ డెస్క్: నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఆ పార్టీ తాజాగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కోల్పోయింది. ఈ రోజు నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 16 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు. మిగిలిన నలుగురు సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నకరేకల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.
2021 సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ మొత్తం 20 స్థానాలకు గాను 11 స్థానంలో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి ఆరు స్థానాల్లో విజయం సాధించారు. అలాగే రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీ రిజర్వ్ కావడంతో రాచకొండ శ్రీనివాస్ గౌడ్ నకిరేకల్ మొట్టమొదటి చైర్మన్ గా ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో నాటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు సగానికి ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఈ రోజు చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ పై అవిశ్వాసం పెట్టాగా.. బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మున్సిపాలిటిని కోల్పోయింది.
తదుపరి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కేదెవరికి
తాజా పరిణామాలతో నకిరేకల్ రాజకీయాలు వేడెక్కాయి. 2023 ఎన్నికల్లో తన చరిష్మాతో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం, తాజాగా మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంలో చక్రం తిప్పారు. అయితే తదుపరి చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది అనే ప్రశ్న కౌన్సిలర్లలో మొదలైంది. ప్రస్తుతం వీరేశం వర్గంలో ఉన్న గౌడ(బీసీ) కౌన్సిలర్లకు ఈ చైర్మన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తుంది. అది కూడా మొదటి నుంచి ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తికే చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్యే వీరేశం ఆశిస్సులు ఎవరికి ఉన్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.