ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష యోచనలో టీజీపీఎస్సీ

by M.Rajitha |
ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష యోచనలో టీజీపీఎస్సీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ లో ఎదురయ్యే సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వం, కార్పొరేషన్లు, సొసైటీలలో ఒకే హోదా, కేటగిరీ, విద్యార్హత కలిగిన ఉద్యోగాలకు వేర్వేరు ప్రకటనలు, వేర్వేరు సంస్థలు చేసినప్పటికీ.. పరీక్ష మాత్రం ఉమ్మడిగానే నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ లో ఒకే కేటగిరీ, హోదా, విద్యార్హతతో కూడిన నోటిఫికేషన్ల వివరాలు సేకరిస్తోంది. వేర్వేరు సంస్థలు వేర్వేరు పరీక్షలు, నియామకాలు చేపట్టడం వల్ల చాలా ఉద్యోగాలు బ్యాక్ లాగ్ స్థితిలో ఉండిపోతున్నాయి. అన్నిటికి విద్యార్హత ఒకటే అయినపుడు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి పరీక్షలు నిర్వహించి, నియమకాలు చేపట్టడం మంచిదనే ఉద్దేశం నియామక సంస్థల్లో నెలకొంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుండి ఆప్షన్లు తీసుకొని వేర్వేరు మెరిట్ జాబితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది.

Next Story

Most Viewed