Dinesh Gunawardena: శ్రీలంక ప్రధాని పదవికి దినేష్ గుణవర్దన రాజీనామా

by Maddikunta Saikiran |
Dinesh Gunawardena: శ్రీలంక ప్రధాని పదవికి దినేష్ గుణవర్దన రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక ప్రధానమంత్రి(Sri Lanka PM) 75 ఏళ్ల దినేష్ గుణవర్దన(Dinesh Gunawardena) సోమవారం తన పదవికి రాజీనామా(Resigned) చేశారు.శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) నేత,అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార మార్పిడిలో భాగంగానే గుణవర్దన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా (X)లో పోస్ట్‌ చేశారు. దిసానాయకే ప్రమాణ స్వీకారోత్సవాని(Swearing-in Ceremony)కి ముందే ప్రధాని రాజీనామా చేయడం జరిగింది.కాగా గుణవర్దన 2022 జూలై నుంచి శ్రీలంక ప్రధానిగా ఉన్నారు.కొత్త అధ్యక్షుడు ఎన్నికైనందున తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని దిసనాయకేకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.కాగా శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్(Marxist) నేత ,నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి)కి చెందిన 56 ఏళ్ల దిసనాయకే,తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవేగయ (SJB)కి చెందిన సాజిత్ ప్రేమదాస(Sajith Premadasa)పై విజయం సాధించారు.

Next Story

Most Viewed