- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : యుద్ధ భూమిలో మానవత్వం నెగ్గదు.. ఐకమత్య బలంతోనే మానవత్వ విజయం : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకుసాగితేనే మానవత్వం గెలుస్తుందని.. యుద్ధభూమిలో మానవత్వం నెగ్గలేదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతలను సాధించేందుకుగానూ అంతర్జాతీయ సమాజం మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో భారత ప్రధాని ప్రసంగించారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంఘర్షణలకు తెరపడాలన్నా, శాంతి గీతం వినిపించాలన్నా మానవత్వాన్ని గెలిపించేందుకు దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలకు ఉమ్మడి ఎజెండా ఉండాలన్నారు. భారత్‌లో 25కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తేవడంలో తాము సఫలమయ్యామని ప్రధాని మోడీ వెల్లడించారు. భారత్ సాధించిన ఈ వికాసం సమ్మిళిత అభివృద్ధికి ఒక నమూనా లాంటిదన్నారు. ఇతర దేశాలు కూడా ఈ నమూనాను అనుసరించవచ్చని సూచించారు.