- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yahya Sinwar: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి..?
దిశ, వెబ్‌డెస్క్:హమాస్(Hamas), హిజ్బుల్లా(Hezbollah) ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel) గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే గాజా(Gaza)లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో(Air Strikes) హమాస్ నాయకుడు (Hamas Leader) యహ్యా సిన్వార్(Yahya Sinwar) మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(IDF) అనుమానిస్తున్నాయి. సిన్వార్ చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నాడని, కొన్ని రోజులుగా అతని కదలికలు లేవని దీంతో అతను చనిపోయి ఉండవచ్చనే అనుమానాలున్నాయని ఇజ్రాయెల్ వార్తా సంస్థలు నివేదించాయి.అయితే ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు మాత్రం లేవని అతను ఇంకా బతికే ఉన్నాడని షిన్ బెట్ ఏజెన్సీ(Shin Bet agency) విశ్వసిస్తోంది
కాగా సిన్వార్ తలదాచుకున్నారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో బాంబులు వేసి హమాస్ సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఆయన చనిపోయి ఉంటారనే ప్రచారం తెరమీదికి వచ్చింది.హమాస్ ఉగ్రవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రచారాన్ని తెరమీదికి తెచ్చి ఉంటుందనే అనుమానం కూడా ఉంది. గతంలో కూడా సిన్వార్ మరణించినట్టుగా తప్పుడు నివేదికలు బయటకు వచ్చాయి.కాగా 2023 డిసెంబర్ లో దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో సిన్వార్ మరణించినట్టు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.కానీ ఆయన ఆ దాడుల నుంచి తప్పించుకొని భయటపడ్డాడు. తాజాగా మరోసారి సిన్వార్ మరణించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై హమాస్ ఆ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.