- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీతో పంత్‌ను పోల్చడం సరైంది కాదు: దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీతో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను పోల్చడాన్ని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తప్పుబట్టాడు. ఇది ఆమోదయోగ్యం కాదన్నాడు. బంగ్లాతో తొలి టెస్టులో పంత్ కెరీర్‌లో 6వ టెస్టు సెంచరీ బాది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే, అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డును కూడా సమం చేశాడు. దీంతో పంత్‌ను ధోనీతో పోలిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా దినేశ్ కార్తీక్ స్పందించాడు. ధోనీతో పంత్‌ను పోల్చడం సరైంది కాదన్నాడు. ‘పంత్ 34 టెస్టులే ఆడాడు. కాబట్టి, అతన్ని భారత గ్రెటెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ అని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. అతనికి ఇంకా సమయం ఇవ్వాలి. కానీ, పంత్ కచ్చితంగా భారత అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఎదుగుతాడని చెప్పగలను. వికెట్‌కీపర్‌గా ధోనీ విజయాలను తక్కువ చేయొద్దు. అతనికి విలువ ఇవ్వాల్సిందే.’ అని వ్యాఖ్యానించాడు.