సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న శుభం మూవీ.. మీకు కచ్చితంగా ఫన్ రైడ్ ఉంటుందని సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |
సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న శుభం మూవీ.. మీకు కచ్చితంగా ఫన్ రైడ్ ఉంటుందని సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’(Subham) చిత్రీకరణ విజయవంతంగా పూరైంది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో సి.మలిరెడ్డి, శ్రీయ కొంఠెం, చరణ్ పెరి, షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు కీరోల్ ప్లే చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఈ చిత్రం ఈ సమ్మర్‌లో రాబోతున్నట్లు చెప్పకనే చెప్పేసింది. అంతేకాకుండా మీకు కచ్చితంగా ఫన్ రైడ్ ఉంటుందని చెప్పేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వసంత్ మరిగంటి(Vasanth Mariganti) రాసిన ఈ కథకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కిస్తున్నారు.


Next Story

Most Viewed