AP News: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..ఇక నుంచి ప్రతీ నెలా జాబ్ మేళా

by Maddikunta Saikiran |
AP News: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..ఇక నుంచి ప్రతీ నెలా జాబ్ మేళా
X

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఇకనుంచి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతీ నెలా జాబ్ మేళా(Job Mela) నిర్వహణకు క్యాలండర్ రూపొందించాలని మంత్రి లోకేష్(Minister Lokesh) విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి(undavalli) నివాసంలో విద్యా శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్(Curriculum) లో మార్పులు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.అలాగే విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని, బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితులు ఉండకూడదని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఛార్జి చైర్మన్ కె.రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed