- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel attack: లెబనాన్ ఆర్మీ సెంటర్‌పై ఇజ్రాయెల్ దాడి.. ఓ సైనికుడు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో(Middle east) ఉద్రిక్తతలు చల్లారడం లేదు. లెబనాన్ ఆర్మీ సెంటర్ (Army center)పై ఆదివారం ఇజ్రాయెల్ (Israel) చేసిన దాడిలో ఒక సైనికుడు మరణించగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డట్టు లెబనీస్ అధికారులు తెలిపారు. నైరుతి లెబనాన్‌లోని టైర్(Tier), నకౌరా(nakowra) ప్రాంతాల మధ్య ఈ దాడి జరిగినట్టు వెల్లడించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి నజీబ్ మికాటి (Nazeeb mikati) దీనిని తీవ్రంగా ఖండించారు. యుద్ధాన్ని ఆపడానికి చేసే అన్ని ప్రయత్నాలను ఈ చర్యలు అడ్డుకుంటాయని తెలిపారు. ఇజ్రాయెల్ నిరంతరం రెచ్చగొడుతుందని చెప్పారు. హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈదాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఐడీఎఫ్ దీనిని ధ్రువీకరించలేదు. మరోవైపు, ఉత్తర, మధ్య ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో 40 మందికి పైగా లెబనీస్ సైనికులు మరణించారు.