Samsung: యాపిల్‌కు పోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై శాంసంగ్ భారీ ఆఫర్లు

by S Gopi |
Samsung: యాపిల్‌కు పోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై శాంసంగ్ భారీ ఆఫర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవడంతో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో పోటీ మొదలైనది. కొత్త మోడళ్ల విడుదలతో పాటు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే దిగ్గజ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఏకంగా తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎస్24 సిరీస్‌పై ఏకంగా 15-35 శాతం తగ్గింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డిస్కౌంట్లు సెప్టెంబర్ 26 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. గతవారం ప్రీమియం బ్రాండ్ యాపిల్ విడుదల చేసిన తన కొత్త సిరీస్ ఐఫోన్ 16 ధరలను దృష్టిలో శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. శాంసంగ్ ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. ఎస్24 మోడల్ ధరలను ఐఫోన్ 16 కంటే తక్కువకు లభించనుంది. బేస్ మోడల్ ఐఫోన్ 16 కంటే ఇది రూ. 20 వేలు తక్కువకు లభిస్తుంది. ఇదే సిరీస్‌లోని ఇతర ఐఫోన్ మోడళ్లతో పోలిస్తే ధర వ్యత్యాసాన్ని శాంసంగ్ క్రెడిట్ కార్డ్‌లపై నగదు తగ్గింపులతో పాటుగా ఎక్స్ఛేంజ్ డీల్‌ ద్వారా గణనీయంగా తగ్గింపు ధరలకు అందిస్తోంది. కాగా, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 3-4 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హై-ఎండ్ విభాగంలో(రూ. 45 వేల కంటే ఎక్కువ ఖరీదైనవి) 15-16 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఈ విభాగంలో యాపిల్, శాంసంగ్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమ్మకాల్లోనూ ఇదే జోరు కొనసాగించవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది.

Advertisement

Next Story