బీసీసీఐని చూసి నేర్చుకోవాలి : పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్

by Harish |
బీసీసీఐని చూసి నేర్చుకోవాలి : పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఫైర్ అయ్యాడు. పాక్ జట్టు వైఫల్యానికి పీసీబీలోని కొందరి అహంకారమే కారణమని ఆరోపించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో అక్మల్ మాట్లాడుతూ..‘జట్టు ఎంపిక, కెప్టెన్, కోచ్ విషయంలో బీసీసీఐ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. బీసీసీఐ నుంచి పీసీబీ ఇవి నేర్చుకోవాలి. వరల్డ్ క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలన్నా, నం.1 జట్టుగా మారాలన్నా ఆ విషయాలు చాలా ముఖ్యం. మనమంతా బాగుంటే పాక్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. కొందరి అహంకారం వల్లే పాక్‌ క్రికెట్ దెబ్బతింటోంది.’ అని చెప్పుకొచ్చాడు. పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూపు స్టేజ్‌లోనే ఇంటిదారిపట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed