Big Breaking: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..త్వరలో వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం..!

by Maddikunta Saikiran |
Big Breaking: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..త్వరలో వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం..!
X

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సోమవారం వెలగపూడి సచివాలయం(Velagapudi Secretariat)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మైనారిటీ సంక్షేమశాఖ(Minority Welfare)పై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ మేరకు మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా మసీదుల(Mosques) నిర్వహణకు 5 వేల రూపాయలు, హజ్ యాత్రికుల(Hajj Pilgrims)కు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలను తొందర్లోనే ప్రారంభించాలని మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు.అలాగే అర్హత ఉన్న ఇమామ్ లను ఖాజీలుగా నియమించాలని,మైనార్టీలకు ఈద్గాలు,స్మశాన వాటికల(Graveyards and cemeteries)కు స్థలాల కేటాయింపు కోసం ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు.కాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే హజ్ యాత్రలో మక్కా(Mecca)ను సందర్శించే ప్రతి ముస్లింకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed