- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక తిన్నెలపై భారీ నిర్మాణాలు.. విజయసాయి కట్టడాల కూల్చివేత
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట భీమిలి బీచ్‌లో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక తెన్నేలపై నిర్మించిన కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. 12 అడుగుల లోతు నుంచి కాంక్రీట్ నిర్మాణాలు కట్టడం, గెడ్డ కబ్జా చేసి దానిపై చిన్నపాటి వంతెన వేయడంతో జీవీఎంసీ అధికారులు మూడు రోజులుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నా, అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలను చూసి టౌన్ ప్లానింగ్ అధికారుల సైతం విస్తుపోతున్నారు. ఇసుక తిన్నెలపై ఇంత భారీ కాంక్రీట్ నిర్మాణాల అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఏసీపీపై బదిలీ వేటు
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఈ అక్రమ కట్టడాలను కూల్చి వేయండి అంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల క్రితం మొదటి విడత హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా పాక్షికంగా నిర్మాణాలను తొలగించిన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సహాయ ప్లానింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. హైకోర్టు రెండో పర్యాయం జోక్యం చేసుకొని కూల్చివేతలను కొనసాగించండని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత ఏసీపీని ఏలూరుకి బదిలీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కూల్చివేతలను ఇప్పుడు పర్యవేక్షిస్తోంది.