Donald Trump: నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్

by Maddikunta Saikiran |
Donald Trump: నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(USA)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్(Republican) పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పోటీ చేస్తుండగా,డెమోక్రాటిక్(Democratic) పార్టీ నుంచి భారత సంతతి మహిళ(Indian-Origin), ప్రస్తుత ఉపాధ్యక్షురాలు(Vice President) కమలా హరీస్(Kamala Harris) బరిలోకి దిగుతున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష ఎన్నికల ప్రచారం మంచి జోరుగా కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అమెరికా ప్రజల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా ఓ ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే, 2028లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ వెల్లడించారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. అయితే ఈ ఎన్నికల్లో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పారు.దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. కాగా 78 ఏళ్ల ట్రంప్‌ 2016-2020 మధ్య US అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.2016లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై గెలుపొందారు. ఆ తరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్(Joe Biden) చేతిలో ఓటమి చెవి చూశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

Next Story

Most Viewed