మద్యంపై ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్.. ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..?

by Mahesh |   ( Updated:2024-10-30 11:12:48.0  )
మద్యంపై ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్.. ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) పండుగల పేర్లు చెబితే ముందుగా గుర్తొచ్చేది మాంసం, మద్యం(alcohol). ఈ రెండు లేకుండా ప్రజలు పండుగలు చేయరనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఓ సంస్థ దేశంలోని ప్రజలు మద్యం తాగడానికి పెడుతున్న ఖర్చు ప్రకారం వివిధ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో(alcohol sales) దూసుకుపోతున్న తెలంగాణ(Telangana) రాష్ట్రం మద్యంపై అత్యదికంగా ఖర్చపెడుతున్న రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో సగటున ఓ వ్యక్తి రూ. 1623 మద్యం కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. అలాగే రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రధేశ్(Andhra Pradesh) సగటున రూ. 1306 ఖర్చు చేస్తుండగా.. మూడో స్థానంలో ఉన్న పంజాబ్(Punjab) రూ. 1245, నాలుగో స్థానంలో నిలచిన ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి 1227 రూపాయలను మద్యం‌పై ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2022 సర్వే ప్రకారం.. దేశంలో పాపులర్ బ్రాండ్లుగా.. కింగ్ ఫిషర్, మెక్‌డోవెల్స్, టుబర్గ్ బ్రాండ్లు నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed