Minaral makeup : మినరల్ మేకప్ గురించి తెలుసా..? అందంతోపాటు ఆరోగ్యం సేఫ్ !

by Javid Pasha |
Minaral makeup : మినరల్ మేకప్ గురించి తెలుసా..? అందంతోపాటు ఆరోగ్యం సేఫ్ !
X

దిశ, ఫీచర్స్ : శుభకార్యాలు, వేడుకలు, పండుగల సందర్భంగా మహిళలు అందంగా రెడీ అవ్వాలనుకోవడం సహజమే. అయితే మేకప్ వేయడం ఆరోగ్యానికి మంచిది కాదని కూడా పెద్దలు, నిపుణులు చెప్తుంటారు. అయినప్పటికీ నలుగురిలో అందంగా, ఆకర్షణగా కనిపించాలన్న మక్కువతో వేసుకోకుండా ఉండలేకపోతారు కొందరు. దీనివల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే మినరల్ మేకప్ వేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎలాంటి హానీ జరగదని చెప్తున్నారు. ఇంతకీ ఈ సరికొత్త మేకప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మేకప్ వేసుకోవడం ఆధునిక కాలంలో వచ్చింది కానీ, పాతకాలంలో ఇది మరో రూపంలో ఉండేదట. ముఖానికి రంగులు అద్దుకోవడానికి భూమిలో దొరికే వివిధ మినరల్స్‌ను, రాళ్లను వాడేవాళ్లు. దాని ఆధారంగానే మినరల్ మేకప్ పద్ధతిని కనుగొన్నారని చెప్తారు. ఈ ఉత్పత్తుల్లో భూమిలో దొరికే మినరల్స్ మాత్రమే ఉంటాయి.

* మేకప్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి వివిధ కలర్స్ కోసం ఐరన్ ఆక్సైడ్ వాడతారని నిపుణులు చెప్తున్నారు. అలాగే సన్ స్క్రీన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం జింక్ ఆక్సైడ్ యూజ్ చేస్తారు. ఇక షైనింగ్ రావడానికి మైకా పొడి, కలర్, సన్ సన్ స్ర్కీన్ లక్షణాల కోసం టైటానియం డై ఆక్సైడ్ వాడుతారు.

సాధారణ మేకప్ వల్ల నష్టాలు

సాధారణ మేకప్ ప్రొడక్ట్స్‌లో మినరల్స్ ఉంటాయి. కానీ వీటితోపాటు కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, పారాబెన్లు మంచి వాసనకోసం కొన్ని రకాల ఫ్రాగ్రెన్సులు వాడుతారు. మేకప్ త్వరగా ఆరిపోపయి మ్యాటె ఫినిషింగ్ రావడానికి మేకప్ ఉత్పత్తుల్లో ఆల్కహాల్ యూజ్ చేస్తారు. ఇది చర్మం డ్రై అయ్యేలా చేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, ఎలర్జీలు, చర్మంపై దద్దుర్లు, స్వేద రంధ్రాలు మూసుకుపోవడం, యాక్నె వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.

మినరల్ మేకప్ బెనిఫిట్స్

* యాక్నె, ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లకు, సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఈ మినరల్ మేకప్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవు. సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు.

* ఇక జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకుంటే కొద్దిసేపటికే ముఖం ముఖం మీద జిడ్డు వల్ల చర్మం మెరిసినట్లు కనిపిస్తుంది. ఈ మినరల్ మేకప్ ప్రొడక్ట్స్‌లో ఉండే నేచురల్ మినరల్స్ జిడ్డును ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి వీటిలో చాలా ఉత్పత్తులు మెరిసే గుణంతో ఉన్నప్పటికీ జిడ్డు చర్మ తత్వం ఉన్నవారికి సరిగ్గా నప్పుతాయని నిపుణులు చెప్తున్నారు.

*జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ వాడుతారు. ఇవి సహజ సన్ స్క్రీన్లుగా పనిచేస్తాయి కాబట్టి మినరల్ మేకప్ వల్ల సహజంగానే సూర్యుడి కిరణాలవల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.

* మినరల్స్‌ను వీలైనంత మేరకు థిన్ పౌడర్‌గా మార్చి ఈ మేకప్ ఉత్పత్తులను తయారు చేస్తారు. కాబట్టి తేలికగా ఉంటాయి. మేకప్ వేసుకున్నామన్న భావన కూడా రాదు. అదే సాధారణ మేకప్ వేసుకున్నప్పుడు మాత్రం చర్మం కాస్త పట్టినట్లు, ముఖం మీద ఏదో పూత పూసినట్లు అనిపిస్తుందని చెప్తారు. మినరల్ మేకప్ మాత్రం చర్మంలో కలిసిపోయినట్లు ఉంటుంది. ఎక్కువ కెన్సర్లు కూడా వాడక్కర్లేదు.

* సాధారణ మేకప్ వల్ల స్కిన్‌పై ముడతలు, గీతలు వంటి సమస్యలు అధికం అవుతాయి. కానీ మినరల్ మేకప్‌లో అలా కాదు. ఇందులోని సహజ గుణాలవల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. యాక్నెవంటి స్కిన్ అలెర్జీలు కూడా నయం అవుతాయి. అలాగే మినరల్ మేకప్ లైట్‌గా వేసినా చాలు ఎక్కువ కవరేజీ ఇవ్వడంతోపాటు ఎక్కువ సమయం చెక్కు చెదరకుండా ఉంటుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed