Pet dogs : కుక్కల తెలివి మామూలుగా ఉండదు! లోతైనా పదాలనూ అర్థం చేసుకుంటాయ్!!

by Javid Pasha |
Pet dogs : కుక్కల తెలివి మామూలుగా ఉండదు! లోతైనా పదాలనూ అర్థం చేసుకుంటాయ్!!
X

దిశ, ఫీచర్స్ : పెంపుడు కుక్కలు తెలివైనవని, యజమాని మాటలకు రెస్పాండ్ అవుతాయని మనకు తెలిసిందే. కానీ అవి అంతకు మించి కూడా చేస్తాయంటున్నారు నిపుణులు. కుటుంబంలో తరచుగా వివిధ సందర్భాల్లో వాడే పదాలను, అవి అచ్చం మనుషుల్లాగే వాటి లోతైన భావాన్ని అర్థం చేసుకోగలవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి పెట్ డాగ్స్‌ బిహేవియర్స్‌పై ఇప్పటి వరకు చాలా పరిశోధనలు జరిగాయి. అయితే రీసెంట్ స్టడీ మాత్రం వాటి లోతైన భాషా పరిజ్ఞానంపై ఫోకస్ పెట్టింది. ఇది తెలుసుకోవడానికి యూకేకు చెందిన కొందరు జంతు శాస్త్ర నిపుణులు కొంత కాలం పెట్ డాగ్స్ బ్రెయిన్ యాక్టివిటీస్‌ను రికార్డ్ చేశారు.

అధ్యయనంలో భాగంగా జంతు శాస్త్ర శాస్త్రవేత్తలు వివిధ జాతులకు చెందిన 19 కుక్కలపై ప్రయోగాలు చేశారు. వాటి మెదడు సామర్థ్యాన్ని, మనుషుల మాటలను అవి అర్థం చేసుకునే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కుక్కలు మనుషులు యూజ్ చేస్తున్న అనేక పద ప్రయోగాలకు సంబంధించిన అర్థాలను, భావోద్వేగాలను మనుషుల్లాగే అర్థం చేసుకోవడం, ఫీల్ అవడం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే సందర్భోచితంగా క్రియేటివిటీని ప్రదర్శించడంలోనూ పెట్‌డాగ్స్ మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు ఒక డాగ్ ముందు, ఒక బంతిని పెట్టి దానిని వేరే పేరుతో పిలిచినప్పటికీ ఆ సిచువేషన్‌ను క్రియేటివిటీతో అర్థం చేసుకుంటున్నట్లు రీసెర్చర్స్ గమనించారు. సో.. కుటుంబాల మధ్య పెరగడం, యజమానులతో పరస్పర చర్యల కారణంగా కుక్కలు కూడా మనుషుల్లాగే పదాలను అర్థం చేసుకోవడం, సందర్భోచితంగా వ్యవహరించడం చేస్తున్నాయి. తరచుగా వాడే పదాలు, భాష పట్ల లోతైన భావన, అవగాహన కలిగి ఉంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed