- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Biswa sharma: జార్ఖండ్‌లో బీజేపీ గెలుస్తుందని ఎప్పుడూ చెప్పలేదు: హిమంత బిస్వ శర్మ
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తాను ఎప్పుడూ చెప్పలేదని అసోం సీఎం, బీజేపీ జార్ఖండ్ ఎన్నికల కో ఇన్‌చార్జ్ హిమంత బిస్వ శర్మ (Himanth biswa sharma) అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ‘జార్ఖండ్ (Jharkhand) ఎంతో కష్టతరమైన రాష్ట్రం. అక్కడ పోరాడటం ఎంతో ముఖ్యం. కానీ మేం గెలుస్తామని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాం’ అని వ్యాఖ్యానించారు. పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని, మరింతగా ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఓటమి భవిష్యత్ విజయానికి ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో చాలా సమయం గడిపానని, జార్ఖండ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ప్రభుత్వం చొరబాటు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఇది రాజ్యాంగ విధి అని నొక్కి చెప్పారు. చొరబాటు విషయంలో ఏ ప్రభుత్వం రాజీపడకూడదని, ఎందుకంటే దానివల్ల అంతిమ ఫలితం జనాభా మార్పును ప్రభావితం చేస్తుందని చెప్పారు.