- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో దారుణం... బాలికపై లైంగిక దాడి
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బాలికపై బాలాజీ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తనను ప్రేమించాలని కొంతకాలంగా బాలిక వెంటపడుతున్నాడని, ఒప్పుకోకపోవడంతో ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని సీఐ రామయ్య తెలిపారు.
కాగా తిరుపతి జిల్లాలో ఇటీవల కాలంలో ఆడవాళ్లు, చిన్నారులు, బాలికపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. ఈ నెల 2న తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో అభంశుభం తెలియని చిన్నారిని ఓ దుర్మార్గుడు కర్కశంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి లైంగిక దాడి జరగడంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. జిల్లాలోనే అత్యధికంగా క్రైమ్ కేసులు నమోదు కావడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. పోలీసు యాంత్రాంగంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా కఠిన నిర్ణయాలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.