ఏపీలో మండిపోతున్న ఎండలు.. 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

by srinivas |
ఏపీలో మండిపోతున్న ఎండలు.. 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నారు. మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు. ఎండ దెబ్బకు భయపడి అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వస్తుననారు. ఇలా రాష్ట్రంలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏపీఎస్డీఎమ్‌ఏ తెలిపింది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించింది. శనివారం రాష్ట్రంలోని 18 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలి అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది. ఎండలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లే క్రమంలో గొడగులు తీసుకెళ్లాలని, ఎక్కువగా నీళ్లు తాగాలని, డీ హైడ్రేషన్ గురయ్యే ఫుడ్‌ను తీసుకోకూడదని తెలిపారు.

Next Story

Most Viewed